![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. కాగా హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి ప్రేక్షకులు వేసే ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే ఒక అవకాశం కల్పించాడు బిగ్ బాస్. అదే 'ఓట్ ఫర్ మి'.
అయితే ఈ 'ఓట్ ఫర్ మి' కి అర్హత సాధించాలంటే.. కండ బలంతో పాటుగా.. బుద్ది బలం కూడా ఉండాలని మళ్ళీ ఋజువు చేసాడు బిగ్ బాస్. రోహిత్ బెస్ట్ అని మళ్ళీ ఋజువైంది. బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కి మూడు ఛాలెంజ్ లు ఇచ్చాడు. ఈ మూడు ఛాలెంజ్ లు ముగిసే సమయానికి ఆదిరెడ్డి, రోహిత్ ఇద్దరూ సరిసమానమైన పాయింట్లతో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ ని ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అభిప్రాయాన్ని చెప్పమనగా, అందరూ కలిసి రోహిత్ కి ఓటు వేసారు. దీంతో రోహిత్ 'ఓట్ ఫర్ మీ' అప్పీల్ కి అర్హత సాధించాడు.
ఆ తర్వాత రోహిత్ తన అప్పీల్ ని ప్రేక్షకులకు తెలియజేసాడు. "నేను రోహిత్.. నేను ఎలా మాట్లాడుతున్నాను. ఎలా వచ్చాను. ఎలా మొదలైంది నా జర్నీ. అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికి అన్ ఫెయిర్ జరుగకూడదని, ప్రతీసారి టాస్క్ లో సింగిల్ గానే పాల్గొన్నాను. నాకు లక్ తక్కువ సపోర్ట్ చేస్తుంది. నేను ప్రతీ టాస్క్ లో వంద శాతం ఇచ్చాను. కానీ బ్యాడ్ లక్.. గెలవలేదు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. 'ఐ రిక్వెస్ట్ టూ ఆడియన్స్.. ఓట్ ఫర్ మి' నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. లవ్ యూ ఆడియన్స్" అని రిక్వెస్ట్ చేసాడు. అయితే ఈ అప్పీల్ తో రోహిత్ కి ఓటింగ్ లో భారీ మెజారిటీ లభించే అవకాశం ఉంది.
![]() |
![]() |